Saturday, March 14, 2026
Homeఆంధ్రప్రదేశ్TTD: ఒంటిమిట్ట కళ్యాణంలో ఉచిత లడ్డూల పంపిణీ.. టీటీడీ వార్షిక బడ్జెట్‌ రూ. 5,456 కోట్లు

TTD: ఒంటిమిట్ట కళ్యాణంలో ఉచిత లడ్డూల పంపిణీ.. టీటీడీ వార్షిక బడ్జెట్‌ రూ. 5,456 కోట్లు

TTD Board Annual Budget: తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో రూ. 5,456 కోట్ల అంచనా బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. బోర్డు సభ్యులు వార్షిక బడ్జెట్‌తో పాటు పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. బడ్జెట్ ముసాయిదాను ధర్మకర్తల మండలి ఆమోదించిన తర్వాత, తుది ఆమోదం కోసం దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/top-stories/health-minister-damodar-rajanarsimha-launches-hpv-vaccination-program-in-telangana/

రూ. 5,456 కోట్ల టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఛైర్మన్‌ బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. 

Also Read: https://teluguprabha.net/business/xiaomi-qled-tv-x-pro-75-69999-price-offer-64999-india/

తిరుపతిలోని వకుళమాత ఆలయంలో గోవింద అక్షరమాల కార్యక్రమాన్ని మండలి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఒంటిమిట్టలో 108 అడుగుల ఎత్తయిన జాంబవంతుడి విగ్రహ ఏర్పాటుకు రూ. 20.17 కోట్లతో పనులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఒంటిమిట్ట కోదండ రాములవారి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఉచిత లడ్డూల పంపిణీకి ధర్మకర్తల మండలి ఆమోదం లభించింది. మరోవైపు గోవిందరాజ స్వామి ఆలయం చుట్టూ సిమెంట్ రహదారి, డ్రెయిన్ల అభివృద్ధిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News