Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్TTD: తిరుమల వెళ్లే వాళ్లకి అలర్ట్.. ఈ తేదీల్లో ఆర్జిత సేవలు రద్దు

TTD: తిరుమల వెళ్లే వాళ్లకి అలర్ట్.. ఈ తేదీల్లో ఆర్జిత సేవలు రద్దు

TTD Brahmotsavam: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసే అక్టోబరు నెలకు సంబంధించిన , ఆర్జిత సేవల కోటా, వివిధ దర్శన టికెట్లపై స్పష్టత వచ్చింది. అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in ద్వారా తమ టికెట్లను బుక్ చేసుకోమని భక్తులు టీటీడీ సూచించింది. అయితే, అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో జరిగే వివిధ సేవలు రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెల్లడించింది.

- Advertisement -

అక్టోబరు నెల కోటా ముఖ్యమైన తేదీలు, వివరాలు:

ప్రత్యేక ప్రవేశ దర్శనం
రూ. 300 టికెట్లు.. జూలై 24వ తేదీ ఉదయన్నే 10 గంటలకు వెబ్‌సైట్‌లో విడుదలకానున్నాయి.

ఆర్జిత సేవా టికెట్లు
ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, ఊంజల్ సేవ: జూలై 22వ తేదీ ఉదయన్నే 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

ఎలక్ట్రానిక్ లక్కీ డిప్
ఆర్జిత సేవా టికెట్లను లక్కీ డిప్ ద్వారా పొందే అవకాశం.. జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. లక్కీడిప్ లో టికెట్లు దక్కిన వాళ్లు జూలై 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లించి టికెట్లను పొందవచ్చు.

తిరుమల, తిరుపతిలో వసతి కోటా
ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి

నవనీత సేవ, శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటా
శ్రీవారి సేవ జూలై 27వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. నవనీత సేవ టోకెన్లు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తే.. అదే విధంగా పరకామణి సేవ టికెట్లు మధ్యాహ్నం 1 గంటకు రిలీజ్ చేస్తారు.

శ్రీవాణి ట్రస్టు టికెట్లు
జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు వెబ్‌సైట్‌లోకి అందుబాటులో రానున్నాయి.

వృద్ధులు, దివ్యాంగుల కోటా
జూలై 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

అక్టోబరులో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబరు 4 నుంచి 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో సుప్రభాత సేవ తప్ప మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. మరోవైపు అక్టోబరు 11, 12 తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు క్యాన్సిల్ చేశారు. అదే విధంగా అక్టోబరు 3 నుంచి 13 వరకు వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణలు రద్దు చేయనున్నారు.

ఈ మార్పులను గమనించి.. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad