HomeTop StoriesTirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం 

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం 

Tirumala Devotees Rush: వేసవి కాలం సెలవుల కారణంగా తిరుమల కొండపై భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోగా.. వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచి ఉంటున్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఈ క్రమంలో భక్తుల రద్దీ కారణంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/metro-hours-extended-during-ipl-match-at-uppal-stadium/

భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవారి అభిషేక సేవ సమయంలో సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తూ టీటీడీ అనుమతిచ్చింది. టీటీడీ నిర్ణయంతో స్వామి వారి అభిషేకాన్ని చూసే అదృష్టం దక్కనుంది. కాగా.. నిన్న శ్రీవారిని 79,603 మంది భక్తులు దర్శించుకున్నారు. 45,125 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గురువారం ఒక్కరోజే హుండీ ఆదాయం రూ. 4.35 కోట్లు సమకూరిందని టీటీడీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News