TTD Ghee CIT Investigation Report : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నెయ్యిలో భారీ కల్తీ జరిగిందని సిట్ నివేదికలు నివేదికలు వెల్లడించాయి. 2019-2024 మధ్య 68 లక్షల కేజీల నెయ్యి సరఫరాలో భోళే బాబా డైరీ కంపెనీపై రూ.250 కోట్ల మోసం నమోదైంది. రసాయనాలు, పామ్ ఆయిల్ మిశ్రణం వాడి నెయ్యి తయారు చేసినట్లు తెలిసింది. బ్లాక్‌లిస్ట్ అయినా సరఫరాలు కొనసాగడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ALSO READ: Mid-day Meal: వికటించిన మిడ్ డే మీల్: 17 మంది విద్యార్థులకు అస్వస్థత
CBI సిట్ ప్రాథమిక నివేదిక ప్రకారం, భోళే బాబా డైరీ బ్లాక్‌లిస్ట్ అయింది. కానీ, 2019 నుంచి కల్తీ నెయ్యి సరఫరా జరిగింది. ఆయిల్, కెమికల్స్ మిశ్రమంతో గోమాంస ఫ్యాట్, ఫిష్ ఆయిల్ కలిపి పంపారు. ఇది TTD ప్రసాద లడ్డుల నాణ్యతను ప్రశ్నార్థకం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేసి, డ్యూప్లికేట్ గీ సప్లై చైన్ దర్యాప్తు చేసింది. ఇప్పటివరకు నలుగురు అరెస్ట్ అయ్యారు. డైరీ మేనేజర్, కెమికల్ సప్లయర్, ట్రేడర్, మధ్యవర్తి ఇందులో ఉన్నారు. మరో 10 మంది నిందితులు లిస్ట్ లో ఉన్నారు. TTD మాజీ చైర్మన్ YV సుబ్బారెడ్డి సన్నిహితుడు అప్పన్న అరెస్టయ్యాడు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, “2019-24 మధ్య వైసీపీ పాలనలో ఈ మోసం జరిగింది. బ్లాక్‌లిస్ట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు? జగన్ ప్రభుత్వం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? భూమన్ కరుణాకర్ రెడ్డి స్పందిస్తారా? లేక జగన్ స్పందిస్తారా?” అని ప్రశ్నలు లేవనెత్తారు.


