నేడు టీటీడీ పాలకమండలి(TTD) సమావేశం జరగనుంది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. సుమారుగా 5,400 కోట్లు అంచనాలతో 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది టీటీడీ బోర్డు.
గడిచిన వార్షిక యేడాది 5,141.74 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 30కు పైగా అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు పాలకమండలి చేయనుంది. సీఎం ప్రకటనతో దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఒక ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.
ముడి సరుకులు కొనుగోలుకు నిధులు విడుదల చేయనున్నారు.ప్రవేటు బ్యాంకుల్లోని టీటీడీ డిపాజిట్ లను వెనక్కు తీసుకొని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనే నిర్ణయంపై నిపుణుల కమిటీ సిఫార్సులపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. వేసవి సెలవులు రద్దీకి సంభందించిన ఏర్పాట్లపై చర్చించనున్నారు.