Monday, November 18, 2024
Homeఆంధ్రప్రదేశ్TTD | శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... టీటీడీ సంచలన నిర్ణయాలు

TTD | శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… టీటీడీ సంచలన నిర్ణయాలు

చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తొలిసారి టీటీడీ (TTD) పాలకమండలి సమావేశం అయింది. 80 అంశాల అజెండాతో ప్రారంభమైన ఈ భేటీలో బోర్డు సంచలన నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు సమావేశం వివరాలను బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. అలాగే టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇవ్వడం లేదా ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

- Advertisement -

Also Read : జనసేన పార్టీ కార్యాలయం వద్ద మహిళా అఘోరి హల్‌చల్

వైసిపి హయాంలో శారదా పీఠానికి కేటాయించిన భూముల లీజును రద్దుచేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ఆ స్థలంలో నిర్మించిన బిల్డింగ్ ని కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. శ్రీనివాస సేతు పైవంతనకు గరుడవారథిగా నామకరణం చేయాలని నిర్ణయించామని చెప్పారు. అన్నదానంలో నూతనంగా మరో ఐటమ్ ను భక్తులకు వడ్డించాలని TTD బోర్డు నిర్ణయించినట్లు బిఆర్ నాయుడు తెలిపారు. శ్రీవారి ప్రసాదాలలో నాణ్యమైన నెయ్యి వినియోగించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించామన్నారు.

తిరుమల డంపింగ్ యార్డ్ లోని చెత్తను మూడు నెలల్లోగా తొలగిస్తామన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు బ్యాంకుల్లోని శ్రీవారి నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదిలాయిస్తామన్నారు. టూరిజం ద్వారా దర్శనం టికెట్లను పూర్తిగా రద్దు చేస్తామన్నారు. టూరిజం శాఖకు కేటాయిస్తున్న 4 వేల ఎస్ఈడీ టికెట్లను రద్దు చేస్తామని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నామని చెప్పారు. తిరుపతి ప్రజలకు ప్రతినెలా మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామని బిఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న బ్రహ్మోత్సవ బహుమానాన్ని రూ.14000 నుంచి రూ.15400 పెంచుతూ ఆదేశాలు జారీ చేశామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News