Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్పులు నేటి నుంచే అమల్లోకి!!

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్పులు నేటి నుంచే అమల్లోకి!!

TTD New SRIVANI Darshan Timings: ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్లను పొందిన భక్తుల సౌకర్యార్థం దర్శన సమయాల్లో ప్రయోగాత్మకంగా మార్పులు చేస్తున్నట్లు ఇటీవలే తితిదే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మార్పులు నేటి (ఆగస్ట్ 1) నుంచి అమలులోకి వచ్చాయి. అంటే భక్తులకు నేటి నుంచే 15వ తేదీ వరకు ఏరోజుకారోజే శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు భక్తులకు కలుగుతుంది.

- Advertisement -

తిరుమలలోని శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి మొదట వచ్చిన వారికే.. మొదట ప్రాతిపదికన 800 టికెట్లను ఇస్తారు. రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుంచి దర్శన టికెట్ల కోటా ఉన్నంత వరకు 200 జారీ చేస్తారు. మొత్తంగా ఈ వెయ్యి టికెట్లను పొందిన వారు స్థానిక వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 వద్ద అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు రిపోర్టింగ్ చేసేలా‌ నిర్ణయించారు.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-police-constable-final-results-released/

ఇక అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా అక్టోబరు 31 వరకు ఆన్‌లైన్ లో శ్రీవాణి‌ టికెట్లు పొందిన భక్తులను యథావిథిగా ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతిస్తారు. నవంబరు 1 నుంచి ఆఫ్‌లైన్‌లోనూ, ఆన్‌లైన్‌లోనూ శ్రీవాణి టికెట్లను పొందిన భక్తులకు… సాయంత్రం 4.30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ys-jagan-nellore-visit-three-cases-filed-against-ysrcp-leaders/

కాగా, నిన్నటివరకు అమల్లో ఉన్న విధానంలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లలో 1,500 టికెట్లు ఇచ్చేవారు. అయితే దీంతో శ్రీవాణి దర్శనానికి 3 రోజుల సమయం పడుతోంది. అందుకే ఇప్పుడు ట్రెయిల్ గా కొత్త పద్ధతిలో దర్శన వేళలను మార్చారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad