TTD Suspended: తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ బోర్డులో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్వాలిటీ శాఖ డిప్యూటీ ఇంజినీర్ గా పనిచేస్తున్న బి.ఎలిజర్.. బర్డ్ ఆస్పత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సు ఎస్.రోజీ.. గ్రేడ్ -1 ఫార్మాసిస్ట్ ఎం.ప్రేమావతి.. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో పని చేస్తున్న జి.అసుంతలను సస్పెండ్ చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
అయితే సస్పెండ్ అయిన వారంతా క్రైస్తవ మతానికి సంబంధించిన వారని.. వారు క్రైస్తవ బోధనలను అనుసరిస్తున్నట్లు నిర్ధరణకు వచ్చింది టీటీడీ. ఆ వెంటనే వారిని ఉద్యోగ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. హిందూ ధార్మిక సంస్థలో పనిచేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారనే నేపథ్యంలో వీరిపై చర్యలు చేపట్టింది.
టీటీడీలో ఉద్యోగం..చర్చీలో ప్రార్థనలు
టీటీడీలో ఉద్యోగం చేస్తూ చర్చీల్లో ప్రార్థనలు చేసే ఉద్యోగుల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చర్చీలో ప్రార్థనలు చేస్తూ కెమెరా కంటపడింది ఓ ఉద్యోగి. వీడియో తీస్తున్నట్లు గుర్తించిన ఆమె ముఖంపై పైట కప్పేసుకుంది. అయితే ఇలాంటి వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.


