Homeఆంధ్రప్రదేశ్TTD: సెప్టెంబరు 15 నుంచి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఆర్జిత సేవలు రద్దు

TTD: సెప్టెంబరు 15 నుంచి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఆర్జిత సేవలు రద్దు

Srivari Brahmotsavams in September: సెప్టెంబరు 15 నుంచి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. బ్రహ్మోత్సవాల నిర్వహించనున్న నేపథ్యంలో 9 రోజుల పాటు ఆర్జిత సేవను టీటీడీ రద్దు చేసింది. అలాగే అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, పిల్లలు, ఎన్ఆర్ఐ దర్శనాలను సైతం రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.

- Advertisement -

15 గంటల్లో సర్వదర్శనం కంప్లీట్..

కాగా, తిరుమలలో భక్తుల రద్దీ యధావిధిగా కొనసాగుతుంది. సోమవారం 78,561 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 33,361 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కంప్లీట్ అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.31 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News