Tirumala| తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) మరో శుభవార్త తెలిపింది. ఇకపై భక్తులు కోరినన్ని లడ్డూ(Laddu)లను ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం తయారుచేస్తున్న లడ్డూల కంటే అవసరమైన ప్రసాదాల తయారీకి కావాల్సిన పోటు సిబ్బందిని నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం రోజుకు 3.5లక్షల చిన్న లడ్డూలతో పాటు 6వేల కళ్యాణం లడ్డూలు, 3,500 వడలను తయారుచేస్తుంది. వీటికి అదనంగా మరో 50 వేల చిన్న లడ్డూలు, 4వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు పోటు విభాగంలో లడ్డూ తయారీకి ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 74 మంది శ్రీ వైష్ణవులతో పాటు మరో 10 పది మంది ఇతర సహాయకులను నియమించనుంది. త్వరలోనే సిబ్బందిని నియమించుకుని లడ్డూల తయారీ సంఖ్యను పెంచనుంది. కాగా భక్తుల సౌకర్యార్థం తిరుపతి(Tirupati) ఆలయాలతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోని ఆలయాల్లోనూ శ్రీవారి ప్రసాదాలు విక్రయిస్తున్నారు.