Sunday, February 23, 2025
Homeఆంధ్రప్రదేశ్Tuni: తుని మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక మళ్లీ వాయిదా

Tuni: తుని మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక మళ్లీ వాయిదా

కాకినాడ జిల్లా తుని(Tuni) మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వరుసగా రెండోరోజూ కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఈ ఎన్నిక మూడుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. తుని ఎమ్మెల్యే(ఎక్స్‌ అఫీషియో సభ్యురాలితో) కలిపి మొత్తం 29 మంది పాల్గొనాల్సి ఉండగా.. కేవలం వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 10 మంది మాత్రమే హాజరయ్యారు.

- Advertisement -

అంతకుముందు వైసీపీ నేతలు చేపట్టిన ఛలో తుని కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. కాకినాడ నుంచి తుని బయలుదేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రెడ్డి, మాజీ ఎంపీ వంగా గీతను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

ఇక మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్​ ఎన్నిక కూడా మరోసారి వాయిదా పడింది. మొత్తం 19 మంది సభ్యుల్లో 14 మంది వైసీపీకి చెందిన వారు, ఐదుగురు కూటమికి చెందిన వారు ఉన్నారు. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News