HomeTop StoriesTragedy: విషాదం.. యూపీలో నరసరావుపేట ప్రయాణికుల బస్సుకి ప్రమాదం.. ఇద్దరు మృతి

Tragedy: విషాదం.. యూపీలో నరసరావుపేట ప్రయాణికుల బస్సుకి ప్రమాదం.. ఇద్దరు మృతి

Road Accident UP: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగువాసులు మృతి చెందిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది. దైవదర్శనం కోసం వెళ్తుండగా  ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పలువురికి గాయాలయ్యాయి. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/harish-rao-and-ktr-fires-on-future-city-and-farmers-problems/

పల్నాడు జిల్లా నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న పర్యాటక బస్సు ఉత్తరప్రదేశ్‌లో బోల్తా పడింది. ఈ ప్రయాణికులు నైమిశారణ్యం దర్శించుకుని, అక్కడి నుంచి లక్నో, అయోధ్య మీదుగా నేపాల్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. దుర్ఘటనలో బస్సు డ్రైవర్, టూరిస్ట్ గైడ్ అక్కడికక్కడే మృతి చెందారు.

Also Read: https://teluguprabha.net/national-news/rajya-sabha-elections-24-seats-june-18-schedule/

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నరసరావుపేట, చిలకలూరిపేట పరిసర ప్రాంతాలకు చెందిన 50 మంది యాత్రికులు ఉన్నారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News