Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: ఏపీ సీఎంతో ఉబర్‌ ప్రనితిధుల భేటీ.. కీలక అంశాలపై చర్చ

CM Chandrababu: ఏపీ సీఎంతో ఉబర్‌ ప్రనితిధుల భేటీ.. కీలక అంశాలపై చర్చ

Uber representatives meet AP CM: ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ గ్లోబల్ లీడర్‌షిప్ ప్రతినిధులు ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఉబర్‌ సీఈవో దారా ఖొస్రోషాహీ నేతృత్వంలోని బృందం సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌తో సాంకేతికత, మొబిలిటీ, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిపై చర్చించింది. పట్టణ రవాణా వ్యవస్థ వంటి విస్తృతమైన అంశాలపై తమ మధ్య చర్చ జరిగిందని మంత్రి లోకేశ్‌ ఎక్స్ వేదికగా తెలిపారు. నూతన టెక్నాలజీతో భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఇలాంటి ప్రపంచ స్థాయి నాయకులతో ఆలోచనలను పంచుకోవడం ఎప్పుడూ నూతన ఉత్తేజాన్నిస్తుందని ‘ఎక్స్‌’లో ఆయన పోస్ట్‌ చేశారు. రాష్ట్రాన్ని టెక్ హబ్ గా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అమరావతి, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో అత్యాధునిక రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతొ పాటు ఉబర్ వంటి గ్లోబల్ ప్లాట్ ఫామ్ లలో ఉపాధి అవకాశాలను మెరుగు పరచడమే లక్ష్యంగా ఈ సమావేశంగా జరిగిందని స్పష్టం చేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/karimnagar-news/karimnagar-jewelry-store-robbery-case-three-accused-arrested/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News