Tirumala Vaikunta Dwara Darshanam: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు పరిసమాప్తం అయ్యాయి. డిసెంబర్ 30 న ప్రారంభమైన ఈ దర్శనాలు గురువారం రాత్రితో ముగిశాయి. 10 రోజుల్లో రికార్డు స్థాయిలో దాదాపు 8 లక్షలకు పైగా భక్తులకు స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/question-paper-leakage-case/
తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రారంభమైన ఉత్తర ద్వార దర్శనాలు గురువారం రాత్రితో పరిసమాప్తం అయ్యాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. 10 రోజుల్లో 7.60 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 9 రోజుల్లోనే 7.09 లక్షల మంది శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. దీంతో రికార్డు స్థాయిలో ఈ సారి దాదాపు 8 లక్షల మందికి భక్తులకు ఆ భాగ్యం కలిగింది. కాగా, గతేడాది పదిరోజుల్లో 6.83లక్షల మంది వైకుంఠ ద్వారం నుంచి శ్రీనివాసుని దర్శించుకున్నారు.
ఇక, వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఈ సారి తొమ్మిది రోజుల్లోనే స్వామి వారికి హుండీ ఆదాయం రూ. 36.86 కోట్లు సమకూరిందని టీటీడీ తెలిపింది. 37.97 లక్షల లడ్డూలు విక్రయించినట్లు చెప్పింది. 2.06 లక్షల మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ వివరించింది. కాగా, ఈ 10 రోజుల కాలంలో, వీఐపీ బ్రేక్ దర్శనాలు(ప్రొటోకాల్ ప్రముఖులు మినహా), శిశువులు, వృద్ధులు, వికలాంగులు, NRIలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.

