Vallabhaneni Vamsi Case: వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇంతకు ముందు వల్లభనేని వంశీకి హైకోర్డు ఇచ్చిన బెయిల్‌పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా తాజాగా తీర్పునిచ్చింది. ఈ పిటిషన్ పై జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీశ్ శర్మ ధర్మాసనం విచారించింది.
ఫిబ్రవరి 16న హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి.. సత్యవర్థన్ కిడ్నాప్ కేసు.. నకిలీ ఇళ్ల పట్టాల కేసు, భూ కబ్జా ఇలా వివిధ కేసుల్లో దాదాపు 137 రోజుల పాటు జైలు జీవితం గడిపిన వంశీ ఇటీవలే బెయిల్ పై బయటకి వచ్చారు. ఆయనపై ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో కొన్ని ముందుస్తు బెయిల్.. మరికొన్ని షరతులతో బెయిల్ ఇవ్వడంతో జూలై 2న విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల అయ్యారు.


