వైసీపీ నేత వల్లభనేని వంశీకి(Vallabhaneni Vamsi) ఊరట లభించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనపై మరిన్ని కేసులు ఉండంటతో ఈ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
కాగా సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీని అరెస్టు చేసి మూడు నెలలు కావడంతో పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే వంశీ తన అనుచరులో కలిసి సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేశారని దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. తాము చెప్పినట్లు వినకపోతే సత్యవర్థన్ కుటుంబాన్ని అంతమొందిస్తామని బెదిరించి అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించినట్లు రుజువు అయిందన్నారు. ఈ సందర్భంగా తనకు అస్వస్థతకు ఉందని.. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని న్యాయమూర్తి ఎదుట వంశీ విన్నవించుకున్నారు. దీంతో ఛార్జీషీటు దాఖలు చేయడంతో పాటు అరెస్టు చేసి మూడు నెలలు అయినందున ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.