వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి(Vallabhaneni Vamsi) మరో షాక్ తగిలింది. కృష్ణా జిల్లా ఆత్కురులో 9 ఎకరాలు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని నమోదైన కేసులో వంశీ రిమాండ్‌ను ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే గన్నవరంలో సీతామహాలక్ష్మి అనే మహిళ స్థలం కబ్జా చేశారన్న కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ గురువారానికి వాయిదా వేసింది..
మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ1గా ఉన్న వంశీ ప్రధాన అనుచరుడు రంగాను మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు అనుమతి ఇచ్చింది కోర్టు. కాగా ఇదే కేసులో ఏ71గా ఉన్న వంశీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు.