యువగళం పాదయాత్రలో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 17న వాల్మీకి జయంతి సందర్భంగా అన్ని జిల్లాల్లోనూ జయంత్యోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే జయంత్యోత్సవాన్ని అనంతపురంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత హాజరుకానున్నారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని ఆదేశిస్తూ అన్ని జిల్లాల బీసీ సంక్షేమ శాఖాధికారులను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్ కు అప్పట్లో పెద్ద సంఖ్యలో వినతులు అందాయి. బీసీల ఆత్మగౌరవానికి ప్రాముఖ్యతనిస్తూ, అప్పట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయింది.
Valmiki Jayanthi AP official festival: రాష్ట్ర పండగగా వాల్మీకి జయంతి
ఈనెల 17న వాల్మీకి జయంతి..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES