Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Valmiki Sangham: స్మశాన స్థలం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి

Valmiki Sangham: స్మశాన స్థలం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి

గోనెగండ్ల మండలం అగ్రహారం గ్రామంలోని 244 సర్వే నెంబర్ లో గల ఐదు ఎకరాల మొత్తం వంక పరం పోగు స్థలాన్ని గ్రామంలోని వాల్మీకుల తో పాటు బీసీ ఎస్సీ సామాజిక వర్గాల వారికి శాశ్వత ప్రాతిపదికన స్మశాన స్థలంగా కేటాయించాలని ఎమ్మిగనూరు తాలూకా వాల్మీకి సంఘం నాయకులు విజీఆర్ కొండయ్య, యాపిలయ్య, గోనెగండ్ల మురళి నాయుడు, రంగస్వామి, రాజ్ కుమార్ నాయుడులు డిమాండ్ చేశారు.
అగ్రహారం గ్రామంలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన 60 సంవత్సరముల వృద్దురాలైన మారెమ్మ ఏప్రిల్ 24 న అనారోగ్యంతో మరణించింది. ఈమెను పూడ్చి పెట్టుటకు (గ్రామపంచాయతీ వారు 244 సర్వే నెంబర్ గల ప్రభుత్వ పరం పోగు స్థలమును స్మశాన వాటికకు వెళ్లారు.అక్కడ గ్రామ వ్యక్తి మారెమ్మ అంత్యక్రియలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. దీంతో అధికారులకు పిర్యాదు చేశారు. ఈ స్థలాన్ని నిర్ధారించి తీర్మానించి నందున) స్మశాన వాటిక దగ్గరికి వాల్మీకులు వెళ్లగా ఆ స్మశాన స్థలం ప్రక్కనే ఉన్న ప్రైవేటు భూమి యజమాని మీరు ఇక్కడ పూడ్చి పెట్టడం వల్ల మా భూమికి ల్యాండ్ వ్యాల్యూ తగ్గుతుందని ఇక్కడ మిమ్మల్ని పూడ్చిపెట్టనివ్వము అని అడ్డుకున్నారు. ఈ విషయాన్ని మండల రెవెన్యూ, పోలీసులకు పిర్యాదు చేశారు. నిర్లక్ష్య సమాధానంతో పట్టించుకోకుండా కాలయాపన చేయడంతో గ్రామ వాల్మీకులు గ్రామంలోని బీసీ, ఎస్సీ లతో కలిసి ఏప్రిల్ 24 వ తేదీ మధ్యాహ్నం నుండి ఏప్రిల్ 25 వ తేదీ మధ్యాహ్నం వరకు శవాన్ని రోడ్డు పై ఉంచి పత్తికొండ, ఎమ్మిగనూరు రహదారిపై ఉంచి ధర్నా నిర్వహించారు.

- Advertisement -

విషయం తెలుసుకున్న ఎమ్మిగనూరు తాలూకా వాల్మీకి సంఘం నాయకులు వెంటనే గ్రామంలోని స్మశాన వాటికను సందర్శించి ఎమ్మార్వో, సీఐ ఇతర అధికారులతో మాట్లాడి సమస్యను శాంతియుతంగా పరిష్కరించి అదే సర్వే నెంబర్లో శవాన్ని పూడ్చి పెట్టించాం. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత ప్రాతిపదికన స్మశాన స్థలాన్ని అధికారులు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో సమస్య సమసిపోయింది. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు వెంకన్న, డీలర్ రంగన్న, రాముడు, రామానాయుడు, గోపాల్, పెద్దయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News