Sunday, December 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Vangaviti marriage: వంగవీటి రాధ దంపతులను ఆశీర్వదించిన ఎపి బిఆర్ఎస్ చీఫ్ తోట

Vangaviti marriage: వంగవీటి రాధ దంపతులను ఆశీర్వదించిన ఎపి బిఆర్ఎస్ చీఫ్ తోట

వంగవీటి రాధ పెళ్లి

దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధకృష్ణ వివాహ వేడుకలు ఆదివారం రాత్రి విజయవాడ నగరం పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో ఘనంగా జరిగాయి. వేడుకకు భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ హాజరై నూతన వధూవరులైన రాధ, పుష్పవల్లి దంపతులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన రంగ తనయుడు ఓ ఇంటి వాడవ్వడం అందరికీ ఆనందదాయకమన్నారు. రాధ వివాహ వేడుకకు టిడిపి, జనసేన, వైసిపి పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రంగా అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News