విశాఖపట్నం (తెలుగు ప్రభ): స్త్రీలు, ఆధ్యాత్మికవేత్తలు, ఉపాసకులకు పవిత్ర శ్రావణమాసంలో ఉచిత పూజా ద్రవ్యాలతో ఈ నెల 14న ‘సామూహిక వరలక్ష్మీ వ్రతాలు’ నిర్వహించనున్నారు. విశాఖ టీటీడీతో పాటు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో తొలి శుక్రవారం ఉదయం 9 గంటలకు పూజలు నిర్వహించనున్నారు.
సాగర్ నగర్‌లోని ఇస్కాన్ టెంపుల్‌లో వెయ్యి మంది మహిళలతో ఈ పూజలుంటాయని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికను ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, సీహెచ్ వంశీకృష్ణ శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ విశాఖ సిబ్బంది, వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ చీఫ్ డైరెక్టర్ సునీత కొటారి, సభ్యులు మానేపల్లి లక్ష్మి, పలివెల విజయ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వివరాలకు 9247784017, 8500641729ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చని విశాఖ క్లస్టర్ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సూపరింటెండెంట్ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

