Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Varikapudisela Lift irrigation works started: వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభం

Varikapudisela Lift irrigation works started: వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభం

పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చేందుకు అడుగులు..

పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ..పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభం..

- Advertisement -

పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, “వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం” క్రింద… రూ. 340.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి కీలక అటవీ, పర్యావరణతో పాటు అన్ని అనుమతులు సాధించి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..

రూ. 340.26 కోట్ల వ్యయంతో వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు. బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించనున్న జగనన్న ప్రభుత్వం…

రాష్ట్రంలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ వరికెపూడిశెల…
4 పంపుల ద్వారా 281 క్యూసెక్కుల నీటి సరఫరా.. • 1.57 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 7 గ్రామాల్లోని 24.900 ఎకరాలకు సాగు నీరు.. 20,000 మంది జనాభాకు తాగునీరు. ఇప్పటికే అటవీ ప్రాంతంలో పంప్ హౌస్ నిర్మాణానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, అటవీ, పర్యావరణ విభాగాల నుండి కీలకమైన అనుమతులతో ఇక పనులకు శ్రీకారం

వరికపూడిశెల ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నది జలాలను మళ్లించి వెనుకబడిన మెట్ట ప్రాంతాల ప్రజల కష్టాలు తీర్చనున్న జగనన్న ప్రభుత్వం..

వన్యప్రాణి సంరక్షణ అనుమతులు సాధించిన తేదీ 19 మే 2023
అటవీ అనుమతులు సాధించిన తేదీ 06 నవంబర్ 2023
ఈ అనుమతులతో అన్ని అడ్డంకులు తొలగి పనుల ప్రారంభానికి సిద్దమైన ప్రాజెక్టు

వెనుకబడిన పల్నాటి సీమ అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక కార్యక్రమాలు

ప్రజలకు పాలన నురింత చేరువ చేస్తూ పాలనా వికేంద్రీకరణ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పల్నాడు జిల్లా ఏర్పాటు…

  • పిడుగురాళ్ల మండలం కామేపల్లిలో రూ. 500కోట్లతో 47.53 ఎకరాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు
  • నాడు – నేడు క్రింద 32 పీహెచ్ సీల ఆధునికీకరణ.. కొత్తగా 7 పీహెచ్ సీ భవనాల నిర్మాణం….
  • పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు రూ.200 కోట్లతో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ఏర్పాటు
  • ఇండో-ఇజ్రాయెల్ టెక్నాలజీతో సాగులో సరికొత్త విధానాలు, సాంకేతికతను తీసుకొస్తూ రూ. 10.69కోట్ల అంచనా వ్యయంతో 26 ఎకరాల విస్తీర్ణంలో నెకరికల్లులో ఉద్యానవన ఉత్పత్తి కేంద్రం
  • 100 ఏళ్ల తర్వాత చేపట్టిన రీసర్వేలో భాగంగా జగనన్న భూహక్కు మరియు జగనన్న భూ రక్ష కార్యక్రమం ద్వారా 107 గ్రామాల్లో 5,35,866 ఎకరాల్లో రీసర్వే పూర్తి చేసి 2,72,000 హద్దు రాళ్ళు ఏర్పాటు, 88,542 మంది లబ్ధిదారులకు భూహక్కు పత్రాల జారీ..
  • జిల్లా వ్యాప్తంగా 97 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం..
    జిల్లా వ్యాప్తంగా 32,624 మంది లబ్ధిదారులకు 90,864 ఎకరాల భూమి యాజమాన్య హక్కు పత్రాలు సీఎం చేతుల మీదుగా జారీ, నిషేధిత జాబితా నుండి చుక్కల భూములు మరియు సెక్షన్ 22 ఏ క్రింద నమోదైన భూముల తొలగింపు, పేదలకు అసైన్డ్, ఇనామ్, లంక భూములు, భూ కొనుగోలు పథకం క్రింది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకు వర్తింపు రోడ్లు, భవనాల శాఖ ద్వారా రూ. 278.28 కోట్ల వ్యయంతో పెదకూరపాడు వద్ద బ్రిడ్జి నిర్మాణంతో పాటు 6 రహదారుల పనులు..
  • రూ.412.36 కోట్ల వ్యయంతో మాచర్ల – దాచేపల్లి (జాతీయ రహదారి నం. 167డి), నాగార్జున సాగర్- దావులపల్లి (జాతీయ రహదారి నం, 565), వాడరేవు – పిడుగురాళ్ల (జాతీయ రహదారి నం. 167 A), కొండమోడు – పేరేచర్ల (జాతీయ రహదారి నం. 167 AG) పరిధిలో 220.61. కి. మీ నిడివితో 4 జాతీయ రహదారుల నిర్మాణం.
    ఈ 54 నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా సంక్షేమ పథకాల రూపంలో రూ.8,812 కోట్ల ప్రత్యక్ష
    నగదు లబ్ధి(డీబీటీ) అందించటమే కాకుండా నాన్ డిబీటీ క్రింద రూ. 3,087 కోట్ల లబ్ధి
    అందించిన జగనన్న ప్రభుత్వం.. మొత్తంగా డీబీటీ, నాన్ డిబీటీల ద్వారా 36,12,980 మంది లబ్ధిదారులకు అందించిన మొత్తం లబ్ధి అక్షరాల రూ. 11,900 కోట్లు,,
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News