Monday, December 9, 2024
Homeఆంధ్రప్రదేశ్Varra Ravinder reddy: వర్రా రవీందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

Varra Ravinder reddy: వర్రా రవీందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

Varra Ravinder reddy| సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితపై అసభ్యకర పోస్టులు పెట్టాడనే కారణంతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి(Varra Ravinder Reddy)ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం 5 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. రవీందర్‌ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు.

- Advertisement -

ఇదిలా ఉండగా వర్రా రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు పొందుపరిచారు. తాజాగా ఈ రిమాండ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది.

రిమాండ్ రిపోర్టులోని కీలకాంశాలు..

“ఐప్యాక్‌ టీమ్‌ కంటెంట్‌ ఇస్తే ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసేవాళ్లం. జగనే కావాలి, జగనన్న రావాలి యాప్‌లో పోస్ట్‌ చేసేవాళ్లం. వైసీపికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని.. నేతలు, వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టాం. వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ వివేక్‌రెడ్డి సూచనలతోనే పోస్టులు పెట్టేవాళ్లం. ముఖ్యంగా సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా ఇంఛార్జ్‌గా బాధ్యత తీసుకున్నాక మరింత రెచ్చిపోయాం. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించాడు.

2023 నుంచి నా ఫేస్‌బుక్‌ ఐడీతో సజ్జల భార్గవరెడ్డి పోస్టులు పెట్టేవారు. షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టాం. ఆ పోస్టులు పెట్టాలని ఎ్ంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి మాకు కంటెంట్‌ ఇచ్చేవారు. ఎలాంటి పోస్టులు పెట్టాలనేది అవినాష్ ‌రెడ్డి, రాఘవరెడ్డి చర్చించేవారు. వారి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, ఆయన పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టాను. వైసీపీ సోషల్‌ మీడియాలో భార్గవరెడ్డి, అర్జున్‌ రెడ్డి, సుమారెడ్డి కీలకం’’ అని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News