Vega Jewellers in Guntur: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుపరిచితమైన ప్రముఖ ఆభరణాల షోరూం వేగా జ్యుయలర్స్.. అక్షయ తృతీయ శుభ తరుణంలో తమ ఖాతాదారులకు మరింత చేరువైంది. గుంటూరులోని లక్ష్మీపురంలో వేగా జ్యుయలర్స్ ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ, వర్ధమాన నటి డింపుల్ హయాతి షోరూంను ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేగా జ్యుయలర్స్ సంస్థ ఛైర్మన్ బండ్లమూడి రామ్మోహన్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమాతో పాటు గుంటూరు నగర ప్రముఖులు, ఖాతాదారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎండీ నవీన్ వనమా మాట్లాడుతూ రాజధాని అమరావతి సమీప ప్రాంతంలో తమ షోరూం ప్రారంభించడం తమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. నూతన షోరూం ప్రారంభోత్సవం, అక్షయ తృతీయను పురస్కరించుకుని 16 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ 2026 వరకు తమ వేగా జ్యుయలర్స్ అన్ని షోరూంలలోనూ ఖాతాదారుల కోసం అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నామని ప్రకటించారు.

బంగారంపై ఆఫర్లు ఇలా..
డైమంట్ ఆభరణాల ప్రతి క్యారట్ ప్రారంభ ధర రూ. 49,999, 22 క్యారట్ హాల్ మార్క్ అన్ని బంగారు ఆభరణాలపైన తరుగు శాతం 5.99 శాతం నుంచి 12.99 శాతం వరకు మాత్రమే ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా పాత బంగారు నగలు మారకంపైన ప్రతి గ్రాముకు రూ. 150 అదనంగా అందిస్తున్నామని.. ఈ ఆఫర్లను అన్ని షోరూంలలో పొందవచ్చని తెలిపారు.
అన్ని వేడుకలు, వివాహాది శుభకార్యాలకు అవసరమైన సంప్రదాయ ఆభరణాలతో పాటు ఆధునిక ఫ్యాషన్‌లకు ప్రతిబింబాలైన వేలాది రకాల ఆభరణాలు ఈ ఆఫర్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. పాత, కొత్త తరాలను మెప్పించే సాంప్రదాయత నుంచి ఆధునికత మేళవించిన అనేక విభిన్న విశిష్ట ఆభరణాల శ్రేణులు విస్తృతంగా షోరూంలో అందుబాటులో ఉంచామని చెప్పారు.
Also Read: https://teluguprabha.net/lifestyle/what-is-girl-dinner-and-why-did-it-go-viral/

ప్రారంభోత్సవం సందర్భంగా అదిరిపోయే ఆఫర్లు
గుంటూరు షోరూం ప్రారంభం సందర్భంగా మొదటి 100 మంది కొనుగోలుదారులకు ప్రతి కొనుగోలుపైన ఒక బంగారు నాణెం ఉచితంగా ఇస్తున్నామని నవీన్ వనమా వెల్లడించారు. షోరూంలో నిర్వహించే లక్కీడ్రాలో మొదటి ఐదుగురు ఖాతాదారులు రూ. 2లక్షల విలువైన బంగారు, లేదా వజ్రాల హారం గెలుపొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆఫర్లు కేవలం గుంటూరు షోరూంలో మాత్రమే అందుబాటులో ఉందని వివరించారు. అక్షయ తృతీయ వేళ బంగారంపైన పెట్టుబడి మంచి శుభసూచకమని.. ఈ రోజుల్లో మన దగ్గర బంగారుం ఉందంటే అవసరానికి ఆదుకునే నగదు మన చేతుల్లో ఉన్నట్లేనని ఈ పరిమిత కాల ఆఫర్లను అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

