Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Veldurthi: రాయితీకి విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

Veldurthi: రాయితీకి విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

వెల్దుర్తి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం నందు అర్హులైన రైతులకు రాయితీపై వేరుశనగ విత్తనాలను పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవమ్మ చేతుల మీదుగా రైతులకు అందజేశారు. రైతులకు విత్తు సమయానికి ముందుగానే గ్రామ స్థాయిలోనే సరైన సమయానికి రాయితీ పై విత్తనాలు అందుబాటులో.. మండలములో రాయితీ విత్తనము కొరత లేదు, కావున అవసరమైన రైతులు రాయితీ విత్తనాన్ని సద్వినియోగం చేసుకోవాలని MLA తెలిపారు. రైతు సంక్షేమములో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని అలాగే రైతు సంక్షేమము ప్రభుత్వ ద్వేయము అని MLA తెలిపారు. వేరుశనగ రాయితీ వివరములు (క్వింటానికి)
పూర్తి ధర : రూ,, = 9300
రాయితీ :రూ,, = 3720 (రాయితీ 40%)
రైతు వాటా : రూ,, = 5580

- Advertisement -

నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ప్రతి గ్రామములో రైతు చెంతకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రభుత్వం అందజేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ADA పత్తికొండ మోహన్ విజయ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీ ప్రవీన్, జెడ్పిటిసి (శ్రీ సుంకన్న), మండల & పట్టణ కన్వీనర్ లు రవి రెడ్డి, వెంకట నాయుడు రైతు సోదరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News