Homeఆంధ్రప్రదేశ్Vempalli: బీసీల సాధికారతకు బాటలు వేసింది కాంగ్రెస్.. డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి

Vempalli: బీసీల సాధికారతకు బాటలు వేసింది కాంగ్రెస్.. డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి

వేంపల్లె (తెలుగుప్రభ): బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతకు బాటలు వేసింది కాంగ్రెస్ పార్టీయే అని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లెలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ ఓట్ల కోసం టీడీపీ, వైకాపాలు పడుతున్న పాట్లు, ఆడుతున్న డ్రామాలు చూస్తుంటే నవ్వు వస్తోందని, సొమ్మొకడిది సోకొకడిది అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.1970లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 1793 ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అప్పటికి టీడీపీ, బీజేపీ, వైకాపా పుట్టలేదన్నారు. దీనివల్ల లక్షలాది మంది బీసీలు ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందారన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ హయాంలోనే బీసీలకు న్యాయం..

1986లో ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో 26 శాతం రిజర్వేషన్లు ఇవ్వగా, 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం దానిని 20 నుంచి 34 శాతానికి పెంచిందన్నారు. 2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీసీలకు ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ ప్రవేశపెట్టారని, 1968లో మొదటి బీసీ కమిషన్, 1974లో కార్పొరేషన్, 1975లో డైరెక్టరేట్, 2006లో వడ్డెర, 2009లో పూసల, ఉప్పర, భట్రాజు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ హయాంలోనే అని పేర్కొన్నారు. హాస్టళ్లు, గురుకులాలు, స్టడీ సర్కిళ్లు, దోబీఘాట్లు, గొర్రెల బీమా, పూలే జయంతి ఉత్తర్వులు కూడా కాంగ్రెస్ తెచ్చిందని అన్నారు.బీసీల పట్ల కపట ప్రేమ, మొసలి కన్నీరు మానుకోవాలని టీడీపీ, వైకాపాలకు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News