వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి(Kakani Govardhan Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో(AP HighCourt) విచారణ ముగిసింది. విచారణ సందర్భంగా కేవలం రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేసినట్లు కాకాణి తరఫు న్యాయవాదులు వాదించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పలువురిని బెదిరించారని పోలీసుల తరఫు న్యాయవాది తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా క్వార్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ కాకాణిపై మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరారీలోనే ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.