ఏపీలోని పలు యూనివర్సిటీలకు వీసీ(Vice Chancellors)లను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ సీఎస్సార్కే ప్రసాద్, యోగి వేమన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ పి.ప్రకాశ్ బాబు, రాయలసీమ వర్సిటీ వీసీగా వెంకట బసవరావు, అనంతపురం జేఎన్టీయూ వీసీగా హెచ్.సుదర్శనరావు , తిరుమల పద్మావతి మహిళా వర్సిటీ వీసీగా ఉమ. మచిలీపట్నం కృష్ణా వర్సిటీ వీసీగా కె.రాంజీ, ఆదికవి నన్నయ వర్సిటీ వీసీగా ప్రసన్న శ్రీ, విక్రమ సింహపురి వర్సిటీ వీసీగా అల్లం శ్రీనివాసరావు నియమితులయ్యారు. వీరంతా మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
Vice Chancellors: ఏపీలో పలు యూనివర్సిటీలకు వీసీల నియామకం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES