ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ (Vijayanand) నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సీఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్న నీరభ్ కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) రేపు పదవీ విరమణ చేయన్నారు. ఈ నేపథ్యంలోనే తదుపరి సీఎస్‌గా విజయానంద్‌ను సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎంపిక చేశారు. 2025 నవంబర్‌లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె ఆయన స్వస్థలం. తొలుత ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, శ్రీకాకుళం, నల్లగొండ జిల్లాల కలెక్టర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. తదుపరి ఏపీ ట్రాన్స్‌కో, జెన్ఎన్కో ఎండీగా సుధీర్ఘ కాలం పాటు విధుల్లో ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధకారిగా కూడా పని చేశారు.
అయితే సీఎస్ ఎంపిక కోసం విజయానంద్‌తో పాటు మరో సీనియర్ అధికారి సాయిప్రసాద్ పోటీ పడ్డారు. కానీ సాయిప్రసాద్‌కు 2026 ఏప్రిల్ వరకూ సర్వీసు ఉంది. విజయానంద్ 2025 నవంబర్ వరకే సర్వీసులో ఉంటారు. దీంతో విజయానంద్ పదవీకాలం ముగిశాక సీనియారిటీ ప్రాతిపదికన సాయిప్రసాద్ సీఎస్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది.