Friday, January 31, 2025
Homeఆంధ్రప్రదేశ్Vijayasai Reddy: జగన్‌తో మాట్లాడాకే రాజీనామా చేశా.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Vijayasai Reddy: జగన్‌తో మాట్లాడాకే రాజీనామా చేశా.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు

వ్యక్తిగత కారణాలతోనే వైసీపీ రాజ్యసభ పదవికి రాజీనామా చేశానని విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు రాజీనామా లేఖ సమర్పించానని.. తన రాజీనామాను ఆయన వెంటనే ఆమోదించారని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. లండన్‌లో ఉన్న వైసీపీ అధినేత జగన్‌ (YS Jagan)తో తాను ఫోన్ మాట్లాడానని చెప్పారు. ఆయనతో మాట్లాడాకే స్పీకర్‌ ఫార్మాట్‌లో తన రాజీనామాను అందజేశానని తెలిపారు. త్వరలోనే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని అన్నారు.

- Advertisement -

జగన్‌ అత్యంత ప్రజాదరణ గల నాయకుడని..తనలాంటి వాళ్లు వెయ్యి మంది వీడినా ఆయనకు ఉన్న ఆదరణ తగ్గదన్నారు. వైసీపీ 11 మంది ఎమ్మెల్యేల బలమే ఉంది కాబట్టి తన రాజీనామాతో కూటమి పార్టీలు లబ్ధి పొందుతాయని వివరించారు. గత నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలతో వైస్ ఫ్యామిలీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఆ కుటుంబంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు కేసు(Kakinada Port Case)లో తనను A2గా చేర్చారని.. కానీ ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తన పిల్లల సాక్షిగా ప్రమాణం చేస్తానని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News