ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు విజయసాయిరెడ్డిని(Vijayasai Reddy) 3 గంటల పాటు విచారించారు. లిక్కర్ పాలసీకి సంబంధించి ఆయన ఇంట్లో జరిగిన మీటింగ్‌లు గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆయన వాస్తవం అని చెప్పినట్లు సమాచారం. వాసుదేవ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సత్యప్రసాద్ మీటింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. కిక్ బ్యాగ్స్ గురించి తనకు తెలియదని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. 2017-18లో రాజ్ కాసిరెడ్డి పార్టీలోకి వచ్చారని తెలిపారు. అతను చాలా తెలివైన క్రిమినల్ అని అయితే తాను మాత్రం అలాంటి వాడు కాదని ఎంకరేజ్ చేశానని వివరించారు. అలాగే ఆయనకు ఎన్ఆర్ఐ విభాగం, తరువాత ప్రశాంత్ కిషోర్ బాధ్యతలు అప్పగించానన్నారు. కానీ రాజ్ కసిరెడ్డి పార్టీని, ప్రజలను మోసం చేశారని తెలిపారు.
అదాన్ డిస్టలరీస్‌కు రూ.60 కోట్లు.. డీకార్ట్ కంపెనీకు రూ.40 కోట్లు ఇప్పించారా అని అడిగారని.. ఇందుకు లోన్ మాత్రం ఇప్పించినట్లు చెప్పానని పేర్కొన్నారు. రూ.60 కోట్లకు 12 శాతం వడ్డీ చెల్లించారన్నారు. తనకున్న సమాచారం ప్రకారం వివరాలన్ని చెప్పానని వెల్లడించారు. ఇక రాజకీయాల్లోకి రీ ఎంట్రీపై మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే తనకు ఎవరి పర్మిషన్ అవసరం లేదని.. అంతా తన ఇష్టం అని చెప్పారు. తాను కావాలంటే తిరిగి రాజకీయాల్లోకి వస్తానని తేల్చి చెప్పారు.