కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌పై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) ప్రశంసలు కురిపించారు. ఇది మధ్య తరగతి బడ్జెట్ అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“ఈ బడ్జెట్ ‘మిడిల్ క్లాస్ బడ్జెట్’ గా గుర్తుండిపోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 8వ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌తో దేశంలోని మధ్య తరగతి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. వేతన జీవులకు ఆదాయ పన్ను ఊరట, కస్టమ్స్ సుంకాలు తగ్గించడం, దృఢమైన ఆర్థిక సంస్కరణలతో ఈ బడ్జెట్ సాధికారత కల్పిస్తుంది. దేశ అభివృద్ధి పథాన్ని మరింత బలోపేతం చేస్తుంది” అని తెలిపారు.
ఇదిలా ఉంటే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో విజయసాయి రెడ్డి రహస్యంగా హైదరాబాద్‌లో భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. దాదాపు మూడు గంటల పాటు షర్మిలతో చర్చలు జరిపినట్లు కథనాలు వస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం షర్మిలతో విజయసాయి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.