ఏపీ లిక్కర్ స్కాంలో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి మారుపేరుతో హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయనను పోలీసులు కాపుకాసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడ తరలించి సిట్ కార్యాలయంలో విచారించారు. కాసేపట్లో కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) సంచలన ట్వీట్ చేశారు.
మద్యం కుంభకోణంలో తన పాత్ర విజిల్ బ్లోయర్ లాంటిదని తెలిపారు. ‘‘తప్పించుకునేందుకే దొరికిన దొంగలు.. దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయీ నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల దుస్తులు సగమే విప్పారు. వారి మిగతా దుస్తులు విప్పేందుకు పూర్తిగా సహకరిస్తాను’’ అని పేర్కొన్నారు. కాగా వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో పాత్రధారి, సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని ఇటీవల విజయసాయి రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే.