Tuesday, November 26, 2024
Homeఆంధ్రప్రదేశ్Vijayawada: శరవేగంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం

Vijayawada: శరవేగంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం

దేశంలోనే ఎక్కడా లేనివిధంగా డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను మేరుగ నాగార్జున పరిశీలించారు. తొలుత నమూనా విగ్రహాలను పరిశీలించిన నిపుణులు, ఉన్నతాధికారులు చివరిగా ధ్రువీకరించిన ఆకారాన్ని రూపొందించినట్టు చెప్పారు. దీనిలో భాగంగా పాదాలకు సంబందించిన బూట్లు తరలించినట్టు..వాటిపై ఫాంట్ కు సంబందించిన విడి భాగాలను వెల్డింగ్ ప్రక్రియలో జాయింట్ చేయనున్నట్టు తెలిపారు.

- Advertisement -

రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నిత్యం అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ కు దేశంలో ఎక్కడ జరగని విధంగా ప్రజలందరూ గుర్తుంచుకునే విధంగా ప్రత్యక్షంగా వీక్షించే రీతిలో విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు తెలిపారు.
భూమి నుండి ఈ విగ్రహం ఎత్తు మొత్తం 205 అడుగులు ఉండనుంది. విగ్రహం చుట్టూ స్మృతి వనం నిర్మాణంతో పాటు సెంట్రల్ లైబ్రరరీ, కన్వెన్షన్ సెంటర్, ఎమ్యూజ్ మెంట్ పార్క్, 2 వేలమంది సామర్థ్యం కలిగిన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు 18 ఎకరాలు ప్రభుత్వ స్థలంలో రూ. 248 కోట్లతో బి.ఆర్. అంబేద్కర్ ప్రాజెక్టు పనులు చేపడుతున్నామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News