Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Vijayawada: మొదటి పశు ఔషధ కేంద్రం ప్రారంభం

Vijayawada: మొదటి పశు ఔషధ కేంద్రం ప్రారంభం

రాష్ట్రంలో పశు పోషకులకు తక్కువ ధరలకు నాణ్యమైన పశువుల జనరిక్ మందులను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 52 పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

- Advertisement -

విజయవాడ లబ్బి పేటలోని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర కార్యాలయ ఆవరణలో డా.వై.యస్.ఆర్. పశుఔషద నేస్తం పధకంలో భాగంగా ఏర్పాటు చేసిన పశు ఔషధ జనరిక్ కేంద్రాన్నిమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జనరిక్ డ్రగ్ స్టోర్‌ను మన రాష్ట్రంలో మొదటగా ఏర్పాటు చేశామన్నారు. రైతులకు అన్నిరకాల మందులు ఈ పశు ఔషధ కేంద్రంలో అందుబాటులో ఉంటాయన్నారు. పశు సంవర్ధక శాఖలో చేపట్టిన వినూత్న కార్యక్రమాల ద్వారా పశు పోషకులకు, రైతులకు మెరుగైన సేవలందిస్తున్నామన్నారు.  పశు వైద్యానికి రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత నిస్తున్నామని, వెటర్నరి అంబులెన్స్‌లకు స్కోచ్ అవార్డులు లభించడం గర్వకారణం అన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలోనే కాకుండా పట్టణ ప్రాంతాలలో కూడా పశు పోషకులకు, పెంపుడు జంతువుల యజమానులకు అన్ని రకాల మందులు జనరిక్ విభాగంలో అందుబాటులో ఉంచామన్నారు. డా.వై.యస్.ఆర్.  పశు ఔషద నేస్తం పధకం ద్వారా ఔషధ కేంద్రాల ఏర్పాటుకు ఔత్సాహిక వ్యాపారవేత్తలు, పశుపోషకులు, జాయింట్ లయబలిటీ గ్రూపులు, స్వయం సహాక సంఘాలు, రైతు ఉత్పత్తి కేంద్రాలు, ఆసక్తి కలిగిన ఇతరులను ఈ పధకంలో లబ్ధిదారులుగా గుర్తిస్తామన్నారు.

          జనరిక్ ఔషద కేంద్రాల ఏర్పాటుకు రూ.4,63,000 యూనిట్ ఖర్చుగా నిర్ధారించామని వాటిలో 75 శాతం ప్రభుత్వం అందిస్తుందని. లబ్ధిదారుని వాటాగా 25 శాతం చెల్లించవలసి ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News