Thursday, November 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Simhapuri University : 800 మార్కుల పరీక్షలకు 2 వేలకు పైగా మార్కులు..అన్నీ తప్పుల తడకలే..

Simhapuri University : 800 మార్కుల పరీక్షలకు 2 వేలకు పైగా మార్కులు..అన్నీ తప్పుల తడకలే..

నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీలో విద్యార్థులకు వింత ఘటన ఎదురైంది. ఇటీవలే కళాశాలలో నిర్వహించిన నాల్గవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది యాజమాన్యం. ఫలితాల్లో తమకెన్ని మార్కులొచ్చాయోనని చూసుకున్న విద్యార్థులు.. ఆ మార్కులు చూసి షాకయ్యారు. 800 మార్కులకు నిర్వహించిన పరీక్షలకు ఒక్కొక్కరికి 2 వేలకు పైగానే మార్కులొచ్చాయి. ఓ విద్యార్థికైతే ఏకంగా 5,360 మార్కులు వచ్చాయి. ఆ మార్కులు చూసిన విద్యార్థులు అయోమయానికి గురయ్యారు.

- Advertisement -

ఏ గ్రేడ్ లో పాసయ్యారో తెలియక సతమతమవుతున్నారు. సెమిస్టర్ పూర్తైన 8 నెలల తర్వాత ఫలితాలు వెల్లడించినప్పటికీ మార్కులు తప్పులు తడకగా ఉండడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. 2 వేలకు పైగా మార్కులు వచ్చినట్లు ఫలితాల్లో చూపించడంతో.. యూనివర్శిటీ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మార్కుల జాబితాలో తప్పులుంటే సవరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News