హొళగుంద మండలం గజ్జెహళ్లి, వందవాగిలి గ్రామంలో వైసిపి ఆలూరు సమన్వయకర్త బూసునే విరుపాక్షి పర్యటించారు. గజ్జెహళ్లి, వందవాగిలి గ్రామంలో విరుపాక్షికి ఘన స్వాగతం పలికారు. వైసిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై అబద్దాలకోరుని తరిమి, ప్రజల గుండెల్లో ధైర్యాన్ని మీరే నింపాలని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖంగా తెలిపారు. సైకిల్ ను శాశ్వతంగా సాగనంపే రోజులు దగ్గరపడ్డాయని, చంద్రబాబు నాయుడు నమ్మొద్దని, హామీలు ఇవ్వడమే కానీ నెరవేర్చినట్టు తన చరిత్రలోనే లేదనే విషయాన్ని గమనించాలని కోరారు. మీకు మంచి జరిగింది అని అనిపిస్తేనే ఓటు వేయండి లేకపోతే వద్దు అనే ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అని విరూపాక్షి సభికులను అడిగారు. జగన్ మోహన్ రెడ్డి లాంటి అరుదైన వ్యక్తిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడం మనందరి బాధ్యత అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షఫీ ఉల్లా, ఎంపీపీ మారయ్య, జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ బావ కురువ శేషప్ప, వైస్ ఎంపీపీ కంచప్ప, కోకన్వీనర్ రవిస్వామి, మేలిగిరి శేషన్న, చిటిగిలి లక్ష్మన్న, హనుమంత్ రెడ్డి, విరుపాక్షి రెడ్డి, బంగారి, దక్షిణ స్వామి, ఎంపీపీ తనయుడు ఈసా, సర్పంచ్ తనయుడు పంపాపతి, యువ నాయకులు దర్గప్ప, ఎస్కే గిరి, ఈరన్న, వైసిపి సీనియర్ నాయకులు రామకృష్ణ, మర్రిస్వామి, గోవిందు, దొడ్డు బసప్ప, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, సచివాలయం కన్వీనర్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.