Visakhapatnam Gas Cylinder Explosion: విశాఖపట్నం నగరంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. హిమాలయ బార్ వద్ద గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్లు తెలిసింది. మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.
సిబ్బంది వెల్డింగ్ చేస్తుండగా..
గురువారం సాయంత్రం ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో.. సిబ్బంది వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందింది. పేలుడు జరిగిన ప్రాంతంలో మృత దేహాలు చెల్లాచెదురై గుర్తుపట్టని విధంగా మారిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది తక్షణమే ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయ బృందాలు, అంబులెన్స్.. సహాయక చర్యలు చేపట్టాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ కమిషనర్ కూడా ప్రమాదంపై ఆరా తీశారు. స్క్రాప్ దుకాణంలో వెల్డింగ్ చేసే సిలిండర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు కూడా ప్రాథమికంగా గుర్తించారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-chandrababu-cm-to-attend-national-handloom-day/
ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు.. క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


