Homeఆంధ్రప్రదేశ్Visakhapatnam: ఏపీలోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు.. అధికారుల కీలక హెచ్చరిక

Visakhapatnam: ఏపీలోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు.. అధికారుల కీలక హెచ్చరిక

ఏపీలోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్‌ ఉందని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ మరియు RTGS సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, గురువారం విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా వచ్చే ఆకస్మిక వరదల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, కాలువలు, నీట మునిగిన కాజ్‌వేలను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. ఇక బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి ఏలూరు జిల్లా బయ్యనగూడెంలో అత్యధికంగా 182.5 మి.మీ వర్షపాతం నమోదుకాగా, జీలుగుమిల్లిలో 139.63 మి.మీ, పి.నారాయణపురంలో 128.75 మి.మీ, కాకినాడ జిల్లా ఆర్యవటంలో 126.25 మి.మీ, పెదపూడిలో 123.69 మి.మీ, ఏలూరు జిల్లా నూతిరామన్నపాలెంలో 122.0 మి.మీ, కాకినాడ జిల్లా కాజులూరులో 121.08 మి.మీ, కరపలో 120.25 మి.మీ, వేళంగిలో 114.01 మి.మీ, మరియు జి.మామిడలో 112.75 మి.మీ చొప్పున వర్షపాతం రికార్డైంది.

- Advertisement -

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News