Homeఆంధ్రప్రదేశ్Ishta Kameshwari Temple: అటవీశాఖ- చెంచు డ్రైవర్ల మధ్య వివాదం.. ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనకి బ్రేక్‌

Ishta Kameshwari Temple: అటవీశాఖ- చెంచు డ్రైవర్ల మధ్య వివాదం.. ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనకి బ్రేక్‌

Ishta Kameshwari Temple Srisailam: శ్రీశైలం సమీపంలోని ప్రసిద్ధ ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయ సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. అటవీశాఖ, చెంచు జీపు డ్రైవర్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/kavitha-says-that-telangana-jagruti-will-continue-as-an-ngo/

ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తిని ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లడానికి ఇడిసి అధికారులు అనుమతించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఎలా అనుమతిస్తారంటూ చెంచు డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు, చెంచు జీపు డ్రైవర్ల మధ్య వివాదం మొదలైంది. ఈ గొడవ కాస్త ముదరడంతో ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లే భక్తుల టికెట్ల రుసుమును అటవీశాఖ సిబ్బంది వెనక్కి ఇచ్చేశారు. వివాదం సద్దు మనిగిన తర్వాతనే యాత్ర పున:ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. 

Also Read: https://teluguprabha.net/crime-news/a-car-hit-a-parked-lorry-killing-a-migrant-from-andhra-pradesh/

సాధారణంగా ప్రతి ఏటా వర్షాకాలంలో అటవీ మార్గం ప్రమాదకరంగా ఉండటం వల్ల, వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా ఆన్‌లైన్ బుకింగ్‌తో పాటు సందర్శనలను నిలిపివేస్తుంటారు. అయితే ఈ వివాదం కారణంగా ఆలయం తాత్కాలికంగా మూసివేయడంతో భక్తులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News