రామానాయుడు స్టూడియో(Ramanaidu Studios)కు నోటీసులు జారీ చేస్తున్నట్లు విశాఖపట్నం కలెక్టర్ తెలిపారు. రామానాయుడు స్టూడియోకు స్టూడియో నిర్మాణం కోసం ప్రభుత్వం 34 ఎకరాలకు పైగా భూమిని కేటాయించిందన్నారు. అందులో 15.17 ఎకరాలు హౌసింగ్ లేఅవుట్ కోసం మార్పు చేయాలని స్టూడియో యాజమాన్యం కోరిందన్నారు. అయితే అది నిబంధనలకు విరుద్ధమని.. నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. అందుకే రెండు వారాల సమయం ఇచ్చామని.. సరైన వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూముల వ్యవహారంపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. స్టూడియోకు కేటాయించిన భూమిలో నివాస స్థలాలుగా మార్పు చేసిన 15.17 ఎకరాల భూ కేటాయింపు రద్దు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ తాజాగా నోటీసులు జారీ చేశారు.