Homeఆంధ్రప్రదేశ్Vizag Mayor: విశాఖ మేయర్ సీటును దళితులకే ఇవ్వాలి

Vizag Mayor: విశాఖ మేయర్ సీటును దళితులకే ఇవ్వాలి

విశాఖలో ‘తెలుగు శక్తి’ బీవీ రామ్, బొడ్డు కళ్యాణ్ రావు డిమాండ్

- Advertisement -

విశాఖపట్నం, (తెలుగు ప్రభ): విశాఖ మేయర్ సీటును దళితులకే కేటాయించాలంటూ దళిత నేత పెద్దాడ రమణ డిమాండ్ చేశారు. నగరంలోని బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణ్ రావు, తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ మద్దతు తెలియజేస్తూ దళిత నేత పెద్దాడ రమణతో కలసి మంగళవారం మీడియాతో మాట్లాడారు. బీవీ రామ్ మాట్లాడుతూ పెద్దాడ రమణకు మద్దతుగా వర్షంలోనూ పెద్ద ఎత్తున దళిత మహిళలు వారి డిమాండ్‌ను వినిపించారన్నారు.

విశాఖలో ఐదు లక్షల పైచిలుకు ఉన్న దళితులకు మేయర్ సీటును కేటాయించాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు వారి మైండ్ సెట్ మార్చుకోవాలన్నారు. ఇప్పటివరకు దళితుల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, రొటేషన్‌లోనైనా ఈసారి దళితులకు మేయర్ సీటు కేటాయించాలన్నారు. బొడ్డు కళ్యాణ్ రావు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా విశాఖ మేయర్ స్థానాన్ని కేవలం బీసీలు, ఓసీలకు మాత్రమే కట్టబెట్టారని, దళితుల్లోనూ విద్యావంతులున్నారని, ఏ పార్టీ అయినా దళితులను చిన్నచూపు చూస్తే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

పెద్దాడ రమణ మాట్లాడుతూ దళితులకు సముచిత స్థానం కల్పించిన పార్టీకే తమ మద్దతు తెలియజేస్తామన్నారు. విశాఖ మహా నగర అభివృద్ధికి దళితుల పాత్ర కీలకమని, ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా దళితుల్ని గుర్తించి మేయర్ సీటు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకొని విశాఖ మేరు స్థానాన్ని దళితులకు ఇవ్వాలని పెద్దాడ రమణ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News