Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Voter list: సెప్టెంబర్ 25 లోపు ఓటర్ల జాబితా పూర్తి చేయాలి

Voter list: సెప్టెంబర్ 25 లోపు ఓటర్ల జాబితా పూర్తి చేయాలి

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా

సెప్టెంబర్ 25 లోపు ఓటర్ల జాబితాకి సంబంధించిన అన్ని మార్పులు, చేర్పులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అదేశించారు. సోమవారం విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ సెప్టెంబర్ 25 లోపు ఓటర్ల జాబితాకి సంబంధించిన అన్ని మార్పులు, చేర్పులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అదేశించారు. పెండింగ్ లో ఉన్న ఇంటింటి సర్వే, జంక్ క్యారెక్టర్స్ ను సవరించి పరిష్కరించే వాటికి సంబంధించి కొన్ని జిల్లాలో ఇంకా పెండింగ్ లో ఉన్నాయని వాటిని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. 06.01.2022 నుండి 31.03.2023 వరకు ఓట్లను తొలగించిన వాటికి సంబంధించిన రీవెరిఫికేషన్ సెప్టెంబర్ 7 వ తేది నాటికి పూర్తి చేయాలని అన్నారు. రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్లకు సంబందించిన పనులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని అన్నారు.

ఎఫ్ ఎల్ సి వర్క్‌షాప్ సెప్టెంబర్ 15 వ తేదీన విజయవాడలో ఎన్నికల సంఘం నిర్వహిస్తుందని, అందుకు గాను కలెక్టర్ ఒక సీనియర్ అధికారిని ఎఫ్ ఎల్ సి సూపర్‌వైజర్‌గా నియమించడంతో పాటు సంబంధిత సమావేశానికి కలెక్టర్లు, ఎఫ్ ఎల్ సి సూపర్‌వైజర్‌లు తప్పకుండా హాజరు కావాలన్నారు. క్లెయిమ్‌లు అభ్యంతరాలను అప్‌లోడ్ చేయడంలో, ప్రతివారం నిర్వహిస్తున్న రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశాల మినిట్స్ అప్లోడ్ చేయడంలో పురోగతి సాధిస్తున్నారని తెలిపారు.
కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హల్ నుండి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, డిఆర్ఓ నాగేశ్వరరావు, ఈఆర్ఓ మల్లికార్జునుడు, ఎన్నికల సూపరిoటెండెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News