Tuesday, March 11, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandra Babu: ప్రకృతి వ్యవసాయానికి ఏపీని చిరునామాగా మారుస్తాం: సీఎం నారా చంద్రబాబు

CM Chandra Babu: ప్రకృతి వ్యవసాయానికి ఏపీని చిరునామాగా మారుస్తాం: సీఎం నారా చంద్రబాబు

మనం తీసుకునే ఆహారమే మెడిసిన్…వంటగదే ఫార్మసీ. సరిగ్గా అనుసరిస్తే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandra Babu) అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. క్యాన్సర్ వస్తే డాక్టర్ వైద్యం చేస్తారు. రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. రానున్న నాలుగేళ్లలో 50 లక్షల ఎకరాలకు ప్రకృతి సేద్యం విస్తరిస్తాం. ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా ఏపీని మార్చుతామన్నారు.

- Advertisement -

మన దేశంలో ఉన్నంత బోధనా సౌకర్యం ఏ దేశంలోనూ లేదు. కొంతమంది ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నారు. కమ్యునికేషన్‌కు మాత్రమే ఇంగ్లీష్ భాష పని చేస్తుంది. మాతృభాషలో చదువుకుంటేనే జ్ఞానం వస్తుంది. పుస్తకం చదవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం చాలా అవసరం. జ్ఞానాన్ని పెంచుకుంటే అవకాశాలు మెండుగా లభిస్తాయి’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడు టు మ్యాన్ హ్యాటన్ గ్రంథావిష్కరణ విజయవాడలోని మురళీ ఫార్య్చూన్ హోటల్ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు.

దత్తాత్రేయుడు తెలుగువారు కావడం గర్వకారణం
మారుమూల గ్రామమైన మంటాడలో పుట్టి ప్రపంచాన్నే మెప్పించి, ప్రపంచానికే సేవలందించిన దత్తాత్రేయుడు మన తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. ఆయన అదృష్టంతోపైకి రాలేదు. ప్రగాఢమైన సంకల్పంతో అంచంచలమైన విశ్వాసంతో ముందుకెళ్లారు. ఎన్టీఆర్ ఇదే జిల్లాలో సాధారణ కుటుంబంలో పుట్టి ఇలాంటి వ్యక్తి మళ్లీ పుడుతారా అనే స్థాయికి వచ్చారంటే అదొక చరిత్ర. ఒక్కోసారి ఒక్కొక్కరి జీవితంలో మలుపు తిరుగుతుంది..దాన్ని అందిపుచ్చుకుంటే ఏ స్థాయికైనా వెళ్తారు. దత్తాత్రేయుడు కుటుంబం వృత్తిలో ఉంటూ సేవలందిస్తున్నారు.

వైద్య రంగంలో ఎన్నో అవార్డులు
వైద్య రంగంలో ఎన్నో అవార్డులు పొందారు. 50 ఏళ్ల పాటు క్యాన్సర్‌ వ్యాధికి సుధీర్ఘంగా సేవలందించారు. మా అత్త బసవతారకం క్యాన్సర్‌ బారిన పడితే మా కుటుంబం అంతా బాధలో ఉన్నాం. అప్పట్లో దేశంలో రెండు ఆసుపత్రులు మాత్రమే ఉన్నాయి. అప్పటికే అమెరికాలో చికిత్స అందిస్తున్న దత్తాత్రేయుడు వద్దకు వెళ్లి చికిత్స తీసుకున్నారు. సీఎం భార్యగా డబ్బులు పెట్టుకుని వైద్యం కోసం అమెరికా వచ్చాను, ఇలా ఎంతమందని ఇక్కడికి రాగలగుతారు అని బసవతారకం అన్నారు. ప్రజలకు అవసరమైన ఒక క్యాన్సర్ ఆసుపత్రి పెడితే బాగుంటుందని అన్నారు.

అప్పట్లో ఎన్టీఆర్ దత్రాత్రేయుడితో మాట్లాడి 7 ఎకరాలు భూమి కేటాయించారు. బసవతారకం చనిపోయాక ఆసుపత్రి పనులు నిలిచిపోయాయి. మళ్లీ నేను ముఖ్యమంత్రి అయ్యా పనులు చేపట్టి బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించాం. హైదరాబాద్‌లో ఉన్న ఆసుపత్రి బాగుంది. అమరావతిలో కూడా పెట్టండని దత్తాత్రేయుడు సంకల్పించారు. అమరావతిలో కూడా బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయించాం. దత్తాత్రేయుడుకు చికిత్స అందించడం వల్ల వచ్చిన అవార్డులు కంటే వైద్యం తీసుకున్న పేషెంట్ల నుంచి వచ్చిన అభినందనలే పెద్ద అవార్డుగా భావిస్తారు.’ అని అన్నారు.


వైద్య రంగంలో ఎన్నో అవార్డులు పొందారు. 50 ఏళ్ల పాటు క్యాన్సర్‌ వ్యాధికి సుధీర్ఘంగా సేవలందించారు. మా అత్త బసవతారకం క్యాన్సర్‌ బారిన పడితే మా కుటుంబం అంతా బాధలో ఉన్నాం. అప్పట్లో దేశంలో రెండు ఆసుపత్రులు మాత్రమే ఉన్నాయి. అప్పటికే అమెరికాలో చికిత్స అందిస్తున్న దత్తాత్రేయుడు వద్దకు వెళ్లి చికిత్స తీసుకున్నారు. సీఎం భార్యగా డబ్బులు పెట్టుకుని వైద్యం కోసం అమెరికా వచ్చాను, ఇలా ఎంతమందని ఇక్కడికి రాగలగుతారు అని బసవతారకం అన్నారు. ప్రజలకు అవసరమైన ఒక క్యాన్సర్ ఆసుపత్రి పెడితే బాగుంటుందని అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ దత్రాత్రేయుడితో మాట్లాడి 7 ఎకరాలు భూమి కేటాయించారు. బసవతారకం చనిపోయాక ఆసుపత్రి పనులు నిలిచిపోయాయి. మళ్లీ నేను ముఖ్యమంత్రి అయ్యా పనులు చేపట్టి బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించాం. హైదరాబాద్‌లో ఉన్న ఆసుపత్రి బాగుంది..అమరావతిలో కూడా పెట్టండని దత్తాత్రేయుడు సంకల్పించారు. అమరావతిలో కూడా బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయించాం. దత్తాత్రేయుడుకు చికిత్స అందించడం వల్ల వచ్చిన అవార్డులు కంటే వైద్యం తీసుకున్న పేషెంట్ల నుంచి వచ్చిన అభినందనలే పెద్ద అవార్డుగా భావిస్తారు.’ అని అన్నారు.

ప్రభుత్వ సలహాదారుగా దత్తాత్రేయుడు
‘క్యాన్సర్ వచ్చిందంటే పేషెంట్లు సగం చినిపోతారు. ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి వస్తుంది. క్యాన్సర్‌లో ఇండియా 3వ స్థానంలో ఉంది. దేశంలో ఏటా 13 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా 9 లక్షల మంది వరకు చనిపోతున్నారు. ఏపీలో ఏటా 70 వేలమంది క్యాన్సర్ బారిన పడి 40 వేల మంది చనిపోతున్నారు. అందుకే రెగ్యులర్ స్క్రీనింగ్ పరీక్షలు ఇంటింటికీ వెళ్లి చేస్తున్నాం. దీని కోసం రూ.624 కోట్లు కేటాయించాం. 4.09 కోట్ల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 1.49 మందికి పూర్తి చేశాం. ఇందులో 56,851 మంది క్యాన్సర్ అనుమానితులుగా గుర్తించాం. 2 కోట్ల మందికి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు టార్గెట్ పెట్టుకోగా ఇప్పటి వరకు 77.53 లక్షల మందికి పరీక్షలు పూర్తి చేశాం. వీరిలో వీరిలో 33 వేల మంది అనుమానితులుగా ఉన్నారు. వ్యాధి నిర్ధారతను ముందుగా తెలుసుకుంటే క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు. దత్తాత్రేయుడు వద్దకు ఎన్నో పెద్ద యూనివర్సిటీల వారు వచ్చి వైద్యం గురించి నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. జన్మభూమిని చూసిన తర్వాత పులకించి ఇక్కడే ఆయన రాసిన గ్రంథం విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దత్తాత్రేయుడుని క్యాన్సర్‌పై ప్రభుత్వ సలహాదారుగా తీసుకుంటున్నాం.’ అని సభలో ప్రకటించారు.

ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందిరిపైనా ఉంది
రైతు వెంకటేశ్వరావు తృణ దాణ్యాల ప్రాధాన్యం, ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలు, ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, భూతాపం ఎలా తగ్గించాలి వంటి అంశాలపై అనేక పుస్తకాలు రాశారు. దావోస్ పర్యటనలో అందరూ భూతాపం, వాతావరణ మార్పు వంటి వాటిపై మాట్లాడారు. దీంతో గ్రీన్ ఎనర్జీ, పచ్చదనం పెంచడం, ప్రకృతి వ్యవసాయం వంటివి మార్గం అని చర్చ ప్రారంభమైంది. అప్పుడు సుభాష్ పాలేకర్‌ను రాష్ట్రానికి పిలిపించి రైతులకు శిక్షణ అందించి ప్రకృతి వ్యవసాయానికి ప్రచారం కల్పించాం. ప్రపంచంలోనే ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయ సాగు లేదు. అప్పట్లో ఐటీ, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాం. క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. డీప్ టెక్నాలజీ ఎలా వాడాలి, ఎలా రీసెర్చ్ చేయాలి, క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా రావాలనే దానిపై వర్కవుట్ చేస్తున్నాం.

పూల బుకేలు కాదు…పుస్తకాలు తీసుకురండి
పంజాబ్ వాళ్లు ఎక్కువగా దేశాన్ని రక్షించడానికి సైన్యంలో పనిచేస్తారు. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్. కానీ ఆ రాష్ట్రంలో ఎక్కవగా వ్యవసాయంలో మందుల వాడకం వల్ల క్యాన్సర్ బాధితులు పెరిగారు. చికిత్స కోసం ఢిల్లీకి వెళ్తున్నారు. పుట్టిన భూమికి సేవలందించడానికి ముందుకొచ్చిన దత్తాత్రేయుడుని అభినందిస్తున్నా. వెల్తీ, హెల్దీ, హ్యాపీ రాష్ట్రంగా ఏపీ ఉండాలి. డబ్బులుండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ టాలెంట్ ఉన్నా, టెక్నాలజీ ఉన్నా రాష్ట్రానికి తీసుకొస్తా. దత్తాత్రేయుడుకు నేను ఇచ్చింది పదవి కాదు…బాధ్యత. ఆయన వల్ల కొన్ని లక్షల మందికి క్యాన్సర్ రాకుండా కాపాడుకేనే అవకాశం వస్తుంది. నన్ను కలవడానికి వచ్చే వారు పూలబుకేలు కాకుండా పుస్తకం తీసుకురావాలనే చెప్తున్నా. మనం ఖర్చు చేసే ప్రతిపైసా పేదలకు ఉపయోగపడాలి.’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News