Web counseling for the first time for filling medical posts: జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఎంపికైన వైద్యులకు మొట్టమొదటి సారిగా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగులు కేటాయిస్తున్నట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పారదర చర్యల్లో భాగంగా ప్రజారోగ్య శాఖలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని ఎన్‌హెచ్‌ఎంలోనూ అనుసరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మెరిట్ ప్రతిపాదికన 392 మెడికల్ ఆఫీసర్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంబీబీఎస్ అర్హత గల అభ్యర్థులను ఒప్పంద ప్రాతిపదికన తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులందరికీ త్వరలోనే పోస్టింగులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులంతా ఈ నెల 20లోగా విధుల్లో చేరేలా వెంటనే జాయినింగ్ ఆర్డర్లు ఇస్తామని వెల్లడించారు.
Also Read: CM Revanth Reddy: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు

