Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్YSRCP: అప్పుడు బాబు చేసిందే ఇప్పుడు జగన్ చేస్తున్నాడా?

YSRCP: అప్పుడు బాబు చేసిందే ఇప్పుడు జగన్ చేస్తున్నాడా?

- Advertisement -

YSRCP: సహజంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. రాస్తారోకోలు, గర్జనలు, దీక్షలు వంటివి చేపట్టి ప్రభుత్వం దిగిరావాలని కోరడం సహజం. అయితే, అధికారంలో ఉన్న పార్టీనే ఈ తరహా నిరసన కార్యక్రమాలకు దిగితే ఎవరి మీద నిరసన వ్యక్తం చేస్తున్నట్లు.. ఎందుకోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఏపీ వ్యాప్తంగా దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్రాన్ని ఎన్నిరకాలుగా వ్యతిరేకించాలో అన్ని రకాలుగా ఆ పని చేశారు.

అక్కడ సీన్ కట్ చేస్తే.. టీడీపీ ఘోర పరాజమై.. వైసీపీ గ్రాండ్ విక్టరీ దక్కించుకొని జగన్ సీఎం అయ్యారు. కాగా ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కూడా ప్రతిపక్షం మాదిరే నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పటికే రాజధానుల పేరిట నాలుగైదు నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ తాజాగా సీమగర్జన పేరుతో కర్నూలులో ఓ కార్యక్రమం చేపట్టారు. సీమ గర్జన ఈ పేరు వినగానే అందరికీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్షాలు, వివిధ కులాలు గర్జనలు పేరుతో చేపట్టే కార్యక్రమాలే గుర్తుకొస్తాయి.

అలాంటిది అధికారంలో ఉన్న వైసీపీ ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడం ప్రజలు ఎలా చూస్తారన్నది ఆ పార్టీ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే గతంలో చంద్రబాబు కూడా అధికారంలో ఉన్న సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వమే చేతుల్లో ఉన్నప్పుడు ఏ పనైనా సాధించుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ నిరసనలతో తాము పని చేయలేకపోతున్నాం అని వాళ్లకి వాళ్ళే ప్రజలకు చెప్పుకున్నట్లే చూస్తారు.

ఇక ఇప్పుడు సీమగర్జన విషయానికి వస్తే.. సీనియర్ నాయకులూ, కాస్త పేరున్న నాయకులెవరూ ఈ సభకి హాజరు కాలేదు. స్థానిక నేతలే ప్రసంగించి మమ అనిపించిన ఈ సభలో విందాం అన్నా రాయలసీమ సమస్యలపై చర్చ లేదు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం రాయలసీమకి ఏం చేసిందో చెప్పలేదు. ప్రసంగించిన వారంతా కేవలం చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మరి కొంతమందైతే ఏకంగా దిష్టిబొమ్మల దహనాలను కూడా దహనం చేశారు. ఇక, అదే సమయంలో సజ్జల లాంటి నేతలు మీడియా సమావేశాలు పెట్టి అదే విమర్శలు చేశారు.

గతంలో కూడా చంద్రబాబు దీక్షలు చేపట్టి భారీ బహిరంగ సభలు నిర్వహించి.. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని తిట్టిన తిట్టకుండా తిట్టారు. తమ పార్టీ నేతల చేత తిట్టించారు. కానీ, ఫలితం సూన్యం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం మీదే.. అధికారం మీదే. ఏం చేసినా మీరే చేయాలి.. అలా చేయలేకపోతే.. మీ వైఫల్యాన్ని మీరు ఒప్పుకున్నట్లే ప్రజలకు లెక్క. అప్పుడు కేంద్రాన్ని అంటేనే వినిపించుకొని ప్రజలు.. ఇప్పుడు ప్రతిపక్షం వలనే తాము పనిచేయలేదంటే వినే పరిస్థితి ఉంటుందా? ప్రతిపక్షం వలన తాము పనిచేయలేదంటే.. తన కంటే ప్రతిపక్షం బలంగా ఉందని ఒప్పుకున్నట్లే కదా.. ఇది ప్రజలు ఎలా తీసుకుంటారో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News