Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Whatsapp Governanace: మన మిత్ర-వాట్సప్ గవర్నెనెస్ ప్రారంభిస్తున్న మంత్రి లోకేష్-లైవ్లో..

Whatsapp Governanace: మన మిత్ర-వాట్సప్ గవర్నెనెస్ ప్రారంభిస్తున్న మంత్రి లోకేష్-లైవ్లో..

మెటా సహకారంతో..

మన మిత్ర – ప్రజల చేతిలో ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఉండవల్లిలోని ప్రజాదర్బార్ వద్ద మన మిత్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు.

- Advertisement -

దేశంలోనే మొదటి సారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకేలా ఈ సేవలు అందుతాయి. వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్బోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకుంది.

డిజిటల్ ఏపీ దిశగా అడుగులు వేయటంలో ఇది భాగం

ఆంధ్రప్రదేశ్‌ను డిజిటల్‌ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో పాలన, ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందజేయడానికి ఈ విధానం సులభతరం కానుంది.  పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మన మిత్ర సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు సర్కారు సగర్వంగా ప్రకటించటం విశేషం.

మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందనున్నాయి. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టింది. యువగళం పాదయాత్రలో తనకు ఈ ఐడియా వచ్చినట్టు ఈ ఐడియాను ఓ సవాలుగా తీసుకుని ప్రజల చేతుల్లో ప్రభుత్వం-పాలన అంటూ తాము ఇది ప్రారంభిస్తున్నట్టు లోకేష్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad