కూటమి ప్రభుత్వం విశాఖ(Vizag) నగరపాలక సంస్థ మేయర్(Mayor) పీఠం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మేయర్‌గా ఉన్న గొలగాని హరి వెంకటకుమారిపై కూటమి సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. ఓటింగ్‌లో మూడింట రెండొంతుల మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో విశాఖ మేయర్ పదవి నుంచి వెంకట కుమారిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మేయర్‌గా కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఈమేరకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రకటన చేశారు.
ఇక గుంటూరు మేయర్‌గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. మేయర్ పదవి కోసం టీడీపీ నుంచి కోవెలమూడి రవీంద్ర పోటీ చేయగా, వైసీపీ నుంచి కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి పోటీలో నిలిచారు. ఎన్నిక జరగగా రవీంద్రకు అనుకూలంగా 34 మంది ఓటు వేయగా.. 27 మంది వెంకటరెడ్డికి ఓటు వేశారు. దీంతో రవీంద్ర విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
మరోవైపు కుప్పం మున్సిపల్ ఛైర్మన్‌గా సెల్వరాజ్ ఎన్నిక కాగా.. మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా ఆకుల మల్లీశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు కూటమి వశం అయ్యాయి.