Thursday, December 12, 2024
HomeAP జిల్లా వార్తలుఅన్నమయ్యCrime News: సినిమాను తలపించే ట్విస్టు.. కువైట్ నుంచి వచ్చి చంపేసి వెళ్లిపోయాడు

Crime News: సినిమాను తలపించే ట్విస్టు.. కువైట్ నుంచి వచ్చి చంపేసి వెళ్లిపోయాడు

Crime News| సినిమాను తలపించే క్రైమ్ స్టోరీ ఇది. మామూలు ట్విస్ట్ కాదు. దిమ్మతిరిగే ట్విస్ట్. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల ఏపీలోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్త మంగంపేటలో శనివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఏం జరిగిందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇంతలో ఓ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ హత్య తానే చేశానని చెబుతూ ఓ వ్యక్తి కువైట్ నుంచి వీడియో రిలీజ్ చేశాడు. ఈ హత్య ఎందుకు చేయాల్సి వచ్చిందో వీడియోలో వివరించడంతో అందరూ నిర్ఘాంతపోయారు. దీంతో ఇప్పుడు ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది.

- Advertisement -

కొత్త మంగంపేటకు చెందిన చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయప్రసాద్ కువైట్‌లో ఉంటున్నారు. వీరి కుమార్తె(12)ను గ్రామంలోనే ఉంటున్న చంద్రకళ చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారు. ఈ క్రమంలో వెంకటరమణ తండ్రి ఆంజనేయులు మనవరాలి వరస అయ్యే బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి తెలిపింది. దీంతో ఆమె వెంటనే కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు నిందితుడు ఆంజనేయులును పిలిపించి మందలించి వదిలేశారు.

ఈ విషయం తండ్రి ఆంజనేయప్రసాద్‌కు తెలియడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో ఇంకెక్కడ న్యాయం జరుగుతుందని భావించాడు. కువైట్ నుంచి వచ్చి శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులను ఇనుప రాడ్‌తో హత్య చేసి వెంటనే కువైట్ వెళ్ళిపోయాడు. తాజాగా ఈ హత్య తానే చేశానని చెబుతూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఆడబిడ్డ తండ్రిగా తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై పోలీసులు కూడా స్పందించకపోవడంతే హత్య చేశానని వివరించాడు. త్వరలోనే ఇండియాకు వచ్చి పోలీసులకు లొంగిపోతానని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News