Friday, July 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Guduru: సూపర్ సిక్స్ తో టిడిపి విజయం ఖాయం

Guduru: సూపర్ సిక్స్ తో టిడిపి విజయం ఖాయం

ప్రచారంలో దూసుకుపోతున్న దస్తగిరి

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో వచ్చే ఎన్నికల్లో టిడిపి విక్టరీ సాధించడం ఖాయమని కోడుమూరు నియోజవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. మండలంలోని గుడిపాడు గ్రామంలో స్థానిక టిడిపి నేత కే మహేశ్వరెడ్డి అధ్యక్షతన బొగ్గుల దస్తగిరి ఇంటింటా ప్రచారం చేపట్టి సూపర్ సిక్స్ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ వైసీపీ నేతలు కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేశార, సూపర్ సిక్స్ పథకాలతో వైసిపి నేతల గుండెల్లో గుబులు మొదలైందని వారు అన్నారు. మహాశక్తి, అన్నదాత, యువగళం, బీసీల రక్షణ చట్టం, ఇంటింటి తగునీరు, పూర్ టు రిచ్ పథకాలకు రాష్ట్ర ప్రజల్లో అపూర్వ ఆదరణ లభిస్తుందన్నారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో కోడుమూరు నియోజవర్గంలో టిడిపి జెండా ఎగరవేసి చరిత్ర సృష్టించాలని టిడిపి నేతలకు, ప్రజలకు బొగ్గుల దస్తగిరి సూచించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పెంచికలపాడు కృష్ణుడు, కే నాగలాపురం జే సురేష్, నాగలాపురం గోపాల్ రెడ్డి, రవి, అలీఫ్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News